ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నికైన టేకు సుదర్శన్ రెడ్డికి హైకోర్టు షాక్ ఇచ్చింది. పట్నంలో 19వ వార్డు కౌన్సిలర్‌గా ఎన్నికైన తన తండ్రి ఆకుల యాదగిరిని ఎవరో కిడ్నాప్ చేశారంటూ కొడుకు హెబియస్ పిటిషన్ వేశారు. దానిపై స్పందించిన న్యాయస్థానం ఆకుల యాదగిరిని ఈ నెల 19లోగా కోర్టు ముందు హాజరు పరచాలని ఇబ్రహీంపట్నం పోలీసులను ఆదేశించింది. అంతవరకు టేకు సుదర్శన్ రెడ్డి నియామకంపై స్టే విధిస్తున్నట్లు ప్రకటించింది.
ఇబ్రహీంపట్నం చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు దక్కించుకోవడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలో చివరి క్షణం వరకు గట్టిగానే ప్రయత్నించాయి. అయితే ఈ ఎన్నికలో ప్రతీ ఒక్క ఓటు చాలా విలువైనదే. కనుక ఇలాంటి సమయంలో ఆకుల యాదగిరి హటాత్తుగా కనిపించకుండా మాయమవడం, ఆయన కిడ్నాప్ చేయబద్దరంటూ కొడుకు పిర్యాదుని న్యాయస్థానం తీవ్రంగానే పరిగణించింది.