మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా పూర్తయినప్పటికీ, , మేయర్, డిప్యూటీ మేయర్ పదవుల ఎన్నికలు మాత్రం ఇండియా-పాకిస్తాన్ యుద్ధాన్ని తలపిస్తున్నాయి.
మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు దక్కించుకోవడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తుండటంతో ఇరు వర్గాల మద్య ఘర్షణలు జరుగుతున్నాయి.
తొర్రూర్‌లో ఎక్స్ అఫీషియో ఓట్లు కీలకంగా మారాయి. కాంగ్రెస్ ఎంపీ కడియం కావ్య ఎక్స్ అఫీషియోగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు రావడంతో ఆమెను అడ్డుకునేందుకు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి రోడ్డుపై బైటాయించి ఆమెను అడ్డుకునేందుకు ప్రయత్నించారు.
వారిపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి ప్రయత్నించడంతో పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. తీవ్ర ఉద్రిక్తల మద్య లాటరీ పద్దతిలో తొర్రూర్ మున్సిపల్ చైర్మన్‌గా తూనం శ్రవణ్, వైస్ చైర్ పర్సన్‌గా సోమ రజిని ఎన్నికయ్యారు.
జనగామ మున్సిపల్ చైర్మన్‌గా లాటరీ పద్దతిలో కాంగ్రెస్ అభ్యర్ధి బాలామణి ఎన్నికయ్యారు.
ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలో ఇదేవిధంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఘర్షణ పడ్డారు. ఆ ఉద్రిక్తతల మధ్యే ఎన్నిక ప్రక్రియ పూర్తయింది. చైర్మన్‌గా బీఆర్ఎస్ పార్టీకి చెందిన టేకు సుదర్శన్ రెడ్డి, వైస్ చైర్ పర్సన్‌గా ముత్యాల శ్యామల ఎన్నికైనట్లు సమాచారం.