విజయ్‌-రష్మికల పెళ్ళికి జోరుగా సన్నాహాలు

February 19, 2026
img

ప్రముఖ తెలుగు సినీ నటులు విజయ్‌ దేవరకొండ, రష్మిక మందనల పెళ్ళి ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఈ నెల 26న రాజస్థాన్‌లోని ఉదయ్ పూర్ కోటలో వారి వివాహం జరుగబోతున్నట్లు సమాచారం.

సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన ఓ శుభలేఖ తప్ప వారిరువురూ కానీ ఇరు కుటుంబాలు గానీ ఇంతవరకు ఈ పెళ్లి గురించి అధికారికంగా ప్రకటించనే లేదు.

కానీ విజయ్‌ దేవరకొండ తల్లితండ్రులు ఇటీవల సిఎం రేవంత్ రెడ్డిని కలిసి పెళ్ళికి ఆహ్వానించారు. హైదరాబాద్‌లోని విజయ్‌ దేవరకొండ ఇంటిని అందంగా లైట్లతో అలంకరించారు. 

ఈ నెల 26న వారి పెళ్ళి, మార్చి 4న హైదరాబాద్‌లో తాజ్ కృష్ణ హోటల్లో అట్టహాసంగా రెసిప్షన్ పార్టీ ఉంటుందని తెలుస్తోంది. ఉదయ్ పూర్‌లో జరిగే వారి పెళ్ళికి అత్యంత సమీప బంధువులు, మిత్రులను, కొందరు ప్రముఖులను మాత్రమే ఆహ్వానించినట్లు తెలుస్తోంది.

ఇది పూర్తిగా వారి కుటుంబ వేడుక కనుక ఈ పెళ్ళి వేడుకని షూట్ చేసేందుకు మీడియాని కూడా అనుమతించకపోవచ్చని సమాచారం.

Related Post