బాల్క సుమన్ అరెస్ట్.. 14 రోజులు రిమాండ్!

February 19, 2026


img

బీఆర్ఎస్‌ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ని బుధవారం సాయంత్రం పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనని మంచిర్యాల జిల్లా కోర్టులో హాజరు పరచగా న్యాయస్థానం ఆయనకు ౧౪ రోజులు జ్యూడిషియల్ రిమాండ్ విదించింది. పోలీసులు ఆయనని జైలుకి తరలించారు. 

క్యాతనపల్లి పురపాలక సంఘం చైర్మన్‌, వైస్ చైర్మన్‌ ఎన్నికలో మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ వంశీ కృష్ణ జోక్యం చేసుకుంటున్నారని నిరసన తెలుపుతూ బాల్క సుమన్ నేతృత్వంలో బీఆర్ఎస్‌ పార్టీ శ్రేణులు రోడ్డుపై బైటాయించి నిరసనలు తెలిపాయి. ఆ క్రమంలో మంత్రి వివేక్, ఎంపీ వంశీ కృష్ణ కార్లపై బీఆర్ఎస్‌ శ్రేణులు రాళ్ళు రువ్వారు. ఈ సందర్భంగా జరిగిన ఘర్షణలలో కానిస్టేబుల్ రాకేష్, ఎస్సైలు రాజశేఖర్ గాయపడ్డారు. 

దేవాపూర్ ఎస్సై గంగారాం, కాంగ్రెస్‌ నాయకుల పిర్యాదు మేరకు మందమర్రి పోలీసులు బాల్క సుమన్‌తో సహా ఆయన అనుచరులపై కేసు నమోదు చేశారు. బుదవారం సాయంత్రం బాల్క సుమన్‌ని అరెస్ట్ చేసేందుకు పోలీసులు వెళ్ళినప్పుడు బీఆర్ఎస్‌ శ్రేణులు వారిని అడ్డుకున్నారు.

ఈ సందర్భంగా  మళ్ళీ అక్కడా తీవ్ర వాగ్వాదాలు, తోపులాటలు జరిగాయి. పోలీసులు అతికష్టం మీద బాల్క సుమన్‌ని అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకువెళ్ళారు. ఈ కేసులో నిందితులుగా పేర్కొన్న ఆయన అనుచరులు కొందరు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు.                  



Related Post