సిఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం బహిరంగ లేఖ వ్రాశారు. త్వరలో శాసనసభ బడ్జెట్ సమావేశాలు జరుగబోతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మూడో సారి బడ్జెట్ ప్రవేశపెట్టబోతోంది.
గత రెండు బడ్జెట్లలో సూపర్ సిక్స్ పధకాల హామీల అమలు కోసం ప్రభుత్వం ఎటువంటి కేటాయింపులు జరుపలేదు. ఎన్నికల సమయంలో ఆ హామీలు అమలు చేసే బాధ్యత తనదేనని, వాటికి చట్టబద్దత కల్పిస్తానని పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి ప్రజలకు హామీ ఇచ్చారు. కానీ ఇంతవరకు ఈ రెండు పనులు చేయలేదు. కనీసం ఈసారైన బడ్జెట్‌లో కేటాయింపులు జరిపి హామీలు నిలుపుకోవాలని, వాటి బకాయిలు ప్రజలకు చెల్లించాలని కేటీఆర్ ఆ లేఖలో పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలు:
1. మహాలక్ష్మి పధకం కింద రాష్ట్రంలో పేద మహిళలకు నెలకు రూ. 4,000 చొప్పున ఇస్తామన్నారు.
2. బీడీ కార్మికులకు నెలకు పించన్ ఇస్తామన్నారు.
3. ఆడబిడ్డలకు తులం బంగారం ఇస్తామన్నారు.
4. రైతుబందు రూ. 15,000 కి పెంచుతామని హామీ ఇచ్చారు.
5. కౌలు రైతులకు, రైతు కూలీలకు కూడా ఆర్ధిక సాయం ఇస్తామన్నారు.
6. దివ్యాంగులకు పించన్లు పెంచుతామన్నారు.
7. నిరుద్యోగులకు నిరుద్యోగ భ్రుతి ఇస్తామని హామీ ఇచ్చారు.
8. మహాలక్ష్మీ పధకం వలన ఉపాధి, ఆదాయం కోల్పోయిన ఆటో డ్రైవర్లకు ఆర్ధిక సాయం చేస్తామన్నారు.