టాక్సిక్‌ టీజర్‌... అదిరింది కానీ..

February 20, 2026


img

గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో యష్‌ హీరోగా ‘టాక్సిక్‌’ (సబ్ టైటిల్: ఏ ఫెయిరీ టేల్‌ ఫర్ గ్రోనప్స్) టీజర్‌ వచ్చేసింది. చాలా అద్భుతంగా ఉంది. ‘టాక్సిక్‌’లో నయనతార, కియరా అద్వానీ, హ్యూమా ఖురేషీ, తారా సుతారియా, రుక్మిణీ వసంత్‌ ఐదుగురు హీరోయిన్లు చేస్తున్నప్పటికీ టీజర్‌ మొత్తం రాకింగ్ స్టార్ యష్‌ని మాత్రమే చూపారు. కానీ టీజర్‌లో హింస, రక్తపాతం చాలా ఎక్కువగా ఉంది. సినిమా మొత్తం ఇలాగే ఉన్నట్లయితే ఫ్యామిలీ ఆడియన్స్ దూరంగా ఉండి పోతారు. టాక్సిక్ సినిమాకి కధ, దర్శకత్వం: గీతు మోహన్ దాస్, సంగీతం: రవి బస్రూర్, కెమెరా: రాజీవ్ రవి, స్టంట్స్: జేజే పెర్రీ (హాలీవుడ్‌), ఎడిటింగ్: ఉజ్వల్ కులకర్ణి చేస్తున్నారు. 

కెవిఎన్ ప్రొడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్లపై వెంకట్ కే నారాయణతో కలిసి యష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాని కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో ఒకేసారి నిర్మించి తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో డబ్ చేసి మార్చి 19న విడుదల చేయబోతున్నారు. 

 <iframe width="560" height="315" src="https://www.youtube.com/embed/zjlCyAibeWg?si=cSDz7p_y2istdAJ4" title="YouTube video player" frameborder="0" allow="accelerometer; autoplay; clipboard-write; encrypted-media; gyroscope; picture-in-picture; web-share" referrerpolicy="strict-origin-when-cross-origin" allowfullscreen></iframe>       

  



Related Post

సినిమా స‌మీక్ష