కమల్ హాసన్-రజనీకాంత్ మల్టీ స్టారర్ ఎన్నాళ్ళకెన్నాళ్ళకు

February 21, 2026


img

ఒకప్పుడు బాలచందర్ తన ఇద్దరు శిష్యులు కమల్ హాసన్, రజనీకాంత్‌లతో వరుసపెట్టి అనేక సినిమాలు చేశారు. ఆ తర్వాత కూడా వారిద్దరూ వేర్వేరుగా అనేక సినిమాలు చేసి తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. సినీ పరిశ్రమ, అభిమానులు కూడా అదొక స్వర్ణయుగమని చెప్పుకుంటారు. 

మళ్ళీ 46 ఏళ్ళ తర్వాత వారిద్దరూ కలిసి నటించబోతున్నారు. ‘జైలర్’తో రజనీకి సూపర్ హిట్ ఇచ్చిన నెల్సన్ సిలీప్ కుమార్‌ దర్శకత్వం వీరిద్దరూ కలిసి నటించబోతున్నారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచంద్రన్‌ సంగీంతం అందించబోతున్నారు. 

కమల్ హాసన్ సొంత బ్యానర్ రాజ్‌కమల్  ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, రెడ్ జైంట్ మూవీస్ కలిసి ఈ సినిమా నిర్మించబోతున్నాయి. కేహెచ్ x ఆర్‌కె పేరుతో నేడు దీని ప్రమో విడుదల చేశారు. వారిరువురి అభిమానులు సంతోషంతో ఉప్పొంగిపోతున్నారు.


Related Post

సినిమా స‌మీక్ష