ఇటీవల నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో వివిధ కేసులకు సంబందించిన దాదాపు 1,100 ఫైల్స్ (సాక్ష్యాధారాలు) కాలి బూడిదయ్యాయి. నాగపూర్ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం వాటి నుంచి మళ్ళీ ఆధారాలు సేకరించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
వివిధ కేసులకు సంబంధించి ఘటనా స్థలంలో లభించిన నిందితుల రక్తం, తల వెంట్రుకలు, గోళ్ళు, వేలి ముద్రలు, పోలీసుల దర్యాప్తులో సేకరించిన బుల్లెట్లు, ఆయుధాలు, కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్లు ఈ అగ్నిప్రమాదంలో కాలి బూడిదయ్యాయని నిపుణుల బృందం తేల్చి చెప్పింది. వివిధ కేసులలో కీలకమైన సాక్ష్యాధారాలు నాశనమవడంతో ఈ ప్రభావం ఆయా కేసుల విచారణపై తప్పక పడుతుంది.
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ అగ్నిప్రమాదం జరిగినప్పుడు స్పందిస్తూ ‘ఓటుకి నోటు కేసుకి సంబంధించి కీలక సాక్ష్యాధారాలు మాయం చేసేందుకే ఇది జరిపించి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. అయితే
ఫోరెన్సిక్ ల్యాబ్ డైరెక్టర్ శిఖా గోయల్ స్పందిస్తూ, “ఈ అగ్నిప్రమాదంలో కంప్యూటర్ ఫోరెన్సిక్ ల్యాబ్, ట్రెనింగ్ హాలుకు స్వల్పంగా నష్టం జరిగింది. కానీ వివిధ కేసులకు సంబంధించి ఫైల్స్, ఫోరెన్సిక్ ల్యాబ్‌లోని పరికరాలు అన్నీ భద్రంగానే ఉన్నాయి.
ఓటుకు నోటు కేసుకు సంబంధించి సాక్ష్యదారాలన్నీ ఎప్పుడో కోర్టుకు సమర్పించాము. ప్రస్తుతం అవన్నీ కోర్టు ఆధీనంలోనే ఉన్నాయి,”అని చెప్పారు.
స్వల్ప నష్టం జరిగింది. ఫైల్స్ అన్నీ భద్రంగానే ఉన్నాయని ఆమె చెప్పగా వివిధ కేసులకు సంబందించిన 1,100 ఫైల్స్ (సాక్ష్యాధారాలు) కాలి బూడిదయ్యాయని నాగపూర్ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం స్పష్టం చేసింది.