నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్ర చేస్తున్న ‘మా ఇంటి బంగారం’ మే 15వ తేదీన విడుదల కాబోతోంది. సమంత ఫోటోతో వేసిన రిలీజ్ పోస్టర్ చాలా సింపుల్‌గా ఉంది. ఇటీవల విడుదలైన టీజర్ చాలా అద్భుతంగా ఉంది. కొత్తగా పెళ్ళయిన వధువు ఓ పెద్ద కుటుంబంలో ఒద్దికగా ఇమడటం చూపించి, హటాత్తుగా యాక్షన్ హీరోయిన్‌లా బస్సులో విలన్లతో ఫైట్ చేసి చితకొట్టేస్తున్నట్లు చూపారు.
ఈ సినిమాకు కధ: రాజ్ నిడిమోరు, వసంత్ మరింగంటి, దర్శకత్వం: నందినీ రెడ్డి, సంగీతం: సంతోష్ నారాయణన్, కెమెరా: ఓం ప్రకాష్, డైలాగ్స్: ఆర్ట్: స్టంట్స్: లీ విట్టకేర్, ఎడిటింగ్: ధర్మేంద్ర కాకర్ల చేశారు.
ఈ సినిమాని సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరి కలిసి ట్రాలాలా మూవీ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.
సమంత, నందిని రెడ్డి కలిసి గతంలో చేసిన ‘ఓహ్ బేబీ’ సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత ఇద్దరూ కలిసి ఈ సినిమా చేస్తున్నారు. కనుక ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.