మూసీ పునరిజ్జీవన పధకంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం రూ.5,000 కోట్లు వ్యయంతో ‘గాంధీ సరోవర్’ ప్రాజెక్ట్ చేపట్టబోతోంది. దీని కోసం రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం పరిధిలో సుమారు 55 ఎకరాల భూసేకరణ ప్రక్రియ ప్రారంభించింది. అక్కడ మూడు నదుల సంగమ ప్రదేశంలో ప్రపంచంలో కెల్లా ఎత్తైన గాంధీ విగ్రహం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ భూసేకరణలో ఇళ్ళు కోల్పోబోతున్నవారు వివిధ రూపాలుగా ప్రభుత్వానికి నిరసనలు తెలియజేస్తూనే ఉన్నారు. కానీ ప్రభుత్వం ముందుకే సాగుతోంది.
ఇలాంటి సమయంలో మహాత్మా గాంధీ మనుమడు తుషార్ గాంధీ చేసిన ట్వీట్ చాలా వైరల్ అవుతోంది. మహాత్మా గాంధీ విగ్రహం ఏర్పాటు చేయడం కోసం ప్రజలను రోడ్డున పడేయం గాంధేయ సిద్దాంతానికి వ్యతిరేకం. కనుక తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి ఈ ఆలోచన విరమించుకోవాలని కోరుతున్నా. ఒకవేళ మహాత్మా గాంధీ జీవించి ఉంటే, నా పేరుతో ఇలాంటి పనులు చేయొద్దని చెప్పి ఉండేవారు,” అని తుషార్ గాంధీ చేసిన ట్వీట్ చేశారు.