నాచురల్ స్టార్ నాని పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా సుజీత్ దర్శకత్వం నాని ప్రధానపాత్రలో ‘బ్లడీ రోమియో’ టైటిల్ ఫస్ట్ గ్లిమ్స్ విడుదల చేశారు. అది యానిమేషన్ వీడియో అయినప్పటికీ అద్భుతంగా ఉంది. వీడియో గురించి వివరించడం కంటే స్వయంగా చూసి తెలుసుకుంటేనే బాగుంటుంది.
ఈ సినిమాలో పృధ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా నటించబోతున్నట్లు తెలుస్తోంది.
నిహారికా ఎంటర్‌టైన్మెంట్స్, యునానిమాస్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. ఈ వేసవిలో బ్లడీ రోమియో షూటింగ్ ప్రారంభం కాబోతోందని ఫస్ట్ గ్లిమ్స్‌లో తెలియజేశారు. కనుక త్వరలోనే బ్లడీ రోమియో టీమ్ వివరాల కోసం ఎదురుచూడవచ్చు.