తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక

February 25, 2026
img

తిరుమల శ్రీవారి భక్తులకు ఓ ముఖ్య గమనిక. సైబర్ క్రైమ్‌ నేరగాళ్ళు టిటిడీ పేరిట నకిలీ వెబ్‌సైట్‌ సృష్టించి, తిరుమల కొండపై కాటేజీలలో గదులు, ఆర్జిత సేవల పేరుతో డబ్బు దండుకుంటున్నాయి.

ఈవిధంగా మోసపోయిన ఓ భక్తుడు ఇచ్చిన పిర్యాదుతో టిటిడీ విజిలెన్స్ విభాగం అప్రమత్తమై విచారణ చేపట్టింది. విచారణలో టిటిడీ అధికారిక వెబ్‌సైట్‌ని పోలి ఉన్న వెబ్‌సైట్‌, దానిలో తిరుమల శ్రీవారి ఆలయ చిత్రాలు వగైరా ఉన్నాయి.

వాటిని చూసి అది నిజమైన టిటిడీ వెబ్‌సైటే అనుకొని భక్తులు గదులు, ఆర్జిత సేవలకు డబ్బు చెల్లిస్తే మోసపోతారని టిటిడీ తెలియజేసింది. ఇది టిటిడీ అధికార వెబ్‌సైట్‌: https://ttddevasthanams.ap.gov.in ఇదేనని ధ్రువీకరించుకున్న తర్వాతే భక్తులు బుకింగ్స్ చేసుకోవాలని టిటిడీ సూచించింది. 

టిటిడీ విజిలెన్స్ విచారణ పరిధి చిన్నది కనుక పోలీసులకు పిర్యాదు చేసింది. భక్తులను మోసం చేసి డబ్బు కాజేస్తునందుకు, టిటిడీ కాపీ రైట్ హక్కులను ఉల్లంఘించినందుకు పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ ప్రారంభించారు.

Related Post