లిక్కర్ స్కాం కేసు తీర్పుపై కేటీఆర్‌ ఏమన్నారంటే...

February 27, 2026


img

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు నుంచి తెలంగాణ జాగృతి  అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితతో సహా ఈ కేసులో 23మందికి ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు క్లీన్ చిట్ ఇచ్చి విముక్తి కల్పించింది. దీనిపై బీఆర్ఎస్‌ పార్టీ ఏవిధంగా స్పందిస్తుందని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా కల్వకుంట్ల కవిత అన్న కేటీఆర్‌ స్పందిస్తారా లేక ఇప్పుడు కూడా మౌనంగా ఉండిపోతారా? అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

బీఆర్ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ స్పందించారు... కానీ చాలా జాగ్రత్తగా స్పందించారు. “ఈ కేసులో కవితకు న్యాయం జరిగింది,” అని చాలా క్లుప్తంగా అన్నారు. కానీ ఈ కేసు గురించి ప్రస్తావిస్తూ, “ఈ మద్యం కుంభకోణం పేరుతో ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని కూలద్రోశారు. అలాగే దీనిలో బీఆర్ఎస్‌ పార్టీని కూడా బలిపశువుగా చేశారు. ఈ కేసు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలను కూడా ప్రభావితం చేసింది. మా నాయకులపై తప్పుడు ఆరోపణలతో, రాజకీయ ప్రేరణతో, కల్పితంగా సృష్టించబడిన ఈ కేసు వేశారని ఈ ఒక్క తీర్పుతో తేలిపోయింది. 

ఈ తీర్పు వెలువడే వరకు కాంగ్రెస్, బీజేపీలు చాలా నిర్లక్ష్యంగా మాపై ఆరోపణలు చేస్తూనే ఉన్నాయి. వాటిని మీడియా మరింత పెద్దదిగా చేసి చూపుతూనే ఉంది. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు, మాపై బురద జల్లేందుకు ఈ కేసుని అందరూ ఉపయోగించుకున్నారు. 

దురదృష్టవశాత్తూ సాక్ష్యాధారాలకు బదులు ఆరోపణలు, విచారణని ప్రభావితం చేసే విధంగా మీడియా కధనాలు ‘న్యూ ఇండియా’లో సర్వసాదారణమైపోయాయి. కానీ చివరికి న్యాయమే గెలుస్తుంది,” అని ట్వీట్‌ చేశారు.


Related Post