మృత్యుంజయ్... ఏ జిందగీ లిరికల్

February 26, 2026


img

శ్రీవిష్ణు తాజా చిత్రం ‘మృత్యుంజయ్’ టీజర్‌ ఇటీవలే విడుదలైంది. అద్భుతంగా ఉంది. తాజాగా ఏ జిందగీ అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్‌ విడుదలయింది. అభినవకవి, కృష్ణకాంత్ వ్రాసిన ఈ పాటని కాల భైరవ స్వరపరిచి సంగీతం అందించగా, దీనిలో ‘రాప్’ని అభినవకవి, మిగిలిన పాటని ఆదిత్య అయ్యంగార్ పాడారు.   

శ్రీ హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వంలో క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌గా రూపొందించిన ఈ చిత్రం మార్చి 6న విడుదల కాబోతోంది.

ఈ సినిమాలో శ్రీవిష్ణు, రెబ్బా మోనికా ప్రధాన పాత్రలు చేశారు. సుదర్శన్, రచ్చ రవి, అయ్యప్ప, సిజ్జు, ఐశ్వర్య, బాలాదిత్య, కృష్ణ కౌశిక్, నంద గోపాల్, మరించి మాధవి ముఖ్యపాత్రలు చేశారు. 

ఈ సినిమాకు కధ, దర్శకత్వం: శ్రీ హుస్సేన్ షా కిరణ్, సంగీతం:కాల భైరవ్, కెమెరా:విద్యా సాగర్ చింత, ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్ చేశారు. 

లైట్ బాక్స్, పిక్చర్ పెర్ఫెక్ట్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్లపై సందీప్ గుణ్ణం, వినయ్ చిలకపాటి కలిసి మృత్యుంజయ్ నిర్మించారు. 


Related Post

సినిమా స‌మీక్ష