మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా చేస్తున్న మూడో ‘వీసా.. వింటారా సరదాగా’ నుంచి అనగనగా అమెరికా సాంగ్ ప్రమో నేడు విడుదలైంది. పూర్తిపాట ఈ నెల 28న విడుదల కాబోతోంది. సనారే వ్రాసిన ఈ పాటకి విజయ్ బుల్గానిన్ సంగీతం అందించగా, సంజిత్ హెగ్డే పాడారు.
అమెరికాలో ఉన్నత చదువులు చదివి ఉద్యోగం సంపాదించి అక్కడే స్థిరపడాలని కోరుకునే భారతీయ యువత గురించి ఈ సినిమా అని టైటిల్‌తోనే చెప్పేశారు దర్శకుడుగా పరిచయం అవుతున్న ‘ఉద్భవ్’. ఈ యూత్ ఫుల్ కామెడీ సినిమాలో శ్రీగౌరీ ప్రియ, శివాత్మిక రాజశేఖర్, రాహుల్ విజయ్ ముఖ్య పాత్రలు చేస్తున్నారు.
సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ సినిమాకు సంగీతం: విజయ్ బుల్గానిన్ అందిస్తున్నారు.