కేసీఆర్ పేరుని పూర్తిగా తుడిచి పెట్టేసేందుకు, చంద్రబాబు ఆదేశం మేరకే సిఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టుని ఎండబెట్టేసి, గోదావరి నీటిని దిగువకు వదిలేస్తున్నారంటూ హరీష్ రావు ఆరోపిస్తూనే ఉన్నారు. కానీ కాళేశ్వరం విషయంలో కేసీఆర్ కంటే తమ ప్రభుత్వానికే చిత్తశుద్ధి ఉందని సిఎం రేవంత్ రెడ్డి నిరూపించుకున్నారు.
దీని కోసం కేసీఆర్ ప్రభుత్వం 10.90 శాతం వడ్డీతో వివిధ ఆర్ధిక సంస్థల నుంచి రూ.82,000 కోట్లు అప్పులు చేసింది. కనుక దీని వడ్డీయే వడ్డీయే రూ.417 కోట్లు చెల్లించాల్సి వచ్చింది.
ఇక 2020 నుంచి కేసీఆర్ అధికారంలో నుంచి దిగిపోయే వరకు చెల్లించిన మొత్తం రూ. 25,803.34 కోట్లు కాగా, సిఎం రేవంత్ రెడ్డి అధికారం చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు చెల్లించిన మొత్తం రూ.46,963 కోట్లు!
గత ఏడాది ఒకేసారి రూ.33,574.11 కోట్లు చెల్లించడంతో దీనిపై వడ్డీ భారం 10.90 శాతం నుంచి 7.5 శాతానికి తగ్గింది.
కానీ ప్రభుత్వం వద్ద ఇంత సొమ్ము లేదు కదా? మరెలా కట్టారు? అంటే తక్కువ వడ్డీతో దీర్గకాలిక రుణాలు తీసుకొని కొంత సర్దుబాటు చేసుకోగా మిగిలింది కేంద్రం సాయంతో కట్టింది.
కేసీఆర్‌పై బురద జల్లడానికి, ఆయన పేరు తుడిచిపెట్టేయడానికి, ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు ఆదేశం మేరకు ఏపీకి నీళ్ళు అందించేందుకే సిఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టుని పాడుబెట్టేస్తున్నారని హరీష్ రావు ఆరోపించని రోజు లేదు.
కానీ రూ.82,000 కోట్లు అప్పులు చేసి కట్టిన ఆ ప్రాజెక్టు నిరుపయోగంగా ఉన్నప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వం వేలకోట్ల అప్పులు, వడ్డీలు చెల్లిస్తూనే ఉంది కదా?
ఓ పక్క ఆ భారం తగ్గించుకునే ప్రయత్నం చేస్తూనే మరోపక్క దెబ్బ తిన్న మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీల మరమత్తులు చేయించి కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది కదా? మరి సిఎం రేవంత్ రెడ్డిని నిబద్దత లేదని ఎలా అనగలుగుతున్నారు?