ఆగస్టులోనే భోగి అంటున్న శర్వానంద్‌!

February 25, 2026


img

శర్వానంద్‌-అనుపమ పరమేశ్వరన్‌ల సూపర్ హిట్ సినిమా ‘శతమానం భవతి’ తర్వాత మళ్ళీ ఇద్దరూ ‘భోగీ’ సినిమాలో కలిసి నటించబోతున్నారు. 

సంపత్ నంది దర్శకత్వంలో చేయబోతున్న ఈ సినిమాలో డింపుల్ హాయతి కూడా నటిస్తున్నారు. 

శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కెకె రాధామోహన్ నిర్మిస్తున్న ‘భోగి’ సినిమాకు కధ, దర్శకత్వం: సంపత్ నంది, పాటలు: చంద్రబోస్, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, కెమెరా: ఎ కిషోర్ కుమార్‌, స్టంట్స్: దిలీప్ సుబ్బరాయన్, ఆర్ట్: కిరణ్ కుమార్‌ మన్నె చేస్తున్నారు. ఈ ఏడాది ఆగస్ట్ 28న విడుదల చేయబోతున్నట్లు తెలియజేస్తూ ఓ పోస్టర్ వేశారు. 

1960లో ‘అణచివేత, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటు, పోరాటాలు’ కధాంశంగా తీసుకొని ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు.


Related Post

సినిమా స‌మీక్ష