బ్యాండ్ మేళం... టీజర్‌ మామూలుగా లేదు!

February 25, 2026


img

 ‘కోర్ట్-వర్సస్ నో బడీ’ సినిమాతో ‘కోర్టు జంట’గా పాపులర్ అయిన యువ నటులు హర్ష్ రోషన్, శ్రీదేవి ఈసారి ప్రేక్షకులను నవ్వించి మెప్పించేందుకు మార్చి13న ‘బ్యాండ్ మేళం’తో వస్తున్నారు. నిన్న విడుదలైన టీజర్‌ చూస్తే ఈసారి బ్యాండ్ మేళం మోత మోగిపోతుందని అర్దమవుతుంది. హర్ష్ రోషన్, శ్రీదేవిల మద్య కెమిస్ట్రీ ఎంత బాగుందంటే, అది 'ఫిజిక్స్' వరకు వెళ్ళకుండా జాగ్రత్తపాడమని సంగీత దర్శకుడు తమన్ నిన్న టీజర్ లాంచ్ ఈవెంటులో సరదాగా హెచ్చరించారు.    

ఈ సినిమాకి కధ, ఎడిటింగ్,  స్క్రీన్ ప్లే: శివ ముప్పరాజు, సంగీతం: విజయ్ బులగనిన్, కెమెరా: సతీష్ ముత్యాల చేస్తున్నారు. సతీష్ జవ్వాజీ దర్శకత్వంలో కోనా ఫిల్మ్ కార్పోరేషన్ బ్యానర్‌పై కావ్య, శ్రావ్య కలిసి ఈ సినిమా నిర్మిస్తున్న ఈ సినిమా మార్చి 13న విడుదల కాబోతోంది.          


Related Post

సినిమా స‌మీక్ష