రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రాష్ రష్మిక మందనల రహస్య ప్రేమ పెళ్ళి పీటల వరకు వచ్చేసింది. ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో పెళ్ళి శుభలేఖ పెట్టి ఈ నెల 26న పెళ్ళి చేసుకుంటున్నామని కన్ఫర్మ్ చేశారు. వారి ప్రేమకథ సుఖాంతం అయ్యిందని అందరూ సంతోషిస్తున్నారు.
రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లోని ఐటిసి మెమొంటోస్‌లో వారి వివాహ వేడుకలు మొదలయ్యాయి. ఇరు కుటుంబ సభ్యులు, సమీప బంధువులు, అత్యంత సన్నిహిత మిత్రుల సమక్షంలో మెహందీ ఫంక్షన్‌తో వారి వివాహ వేడుకలు మొదలయ్యాయి. ఇప్పుడు ప్రేమించుకుంటున్న, పెళ్ళి చేసుకోబోతున్న జంటలు ఇద్దరి పేర్లు కలిపి ఒకటిగా కొత్త పేరు ఏర్పాటు చేసుకోవడం కొత్త ట్రెండ్. కనుక విజయ్ దేవరకొండ, రష్మిక మందనల తమ పేర్లను కలిపి ‘విరోష్’ అని పెట్టుకొని శుభలేఖలో తెలియజేశారు.
ఉదయ్‌పూర్‌లో పెళ్ళి వేడుక ముగిసిన తర్వాత మార్చి మొదటి వారంలో హైదరాబాద్‌లో గ్రాండ్ రిసిప్షన్ పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. దీనికి సినీ పరిశ్రమతో పాటు ఏపీ తెలంగాణ, రాజకీయ, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను ఆహ్వానించినట్లు తెలుస్తోంది.