శ్రీకాంత్ ఓదెల-నాని కాంబినేషన్ రూపొందుతున్న ‘ది ప్యారడైజ్’ నుంచి ‘అయారే షేర్...’ అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్ విడుదలైంది.
ఈ సినిమాలో రెండు జడలతో నాని లుక్స్ చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి. ఈ పాటలో నాని స్టైల్, ముఖ్యంగా ‘హుక్ స్టెప్స్’ చాలా అద్భుతంగా ఉన్నాయి.
ఈ సినిమాలో నానికి జోడీగా సోనాలి కులకర్ణి నటిస్తుండగా, విలన్ ‘శికంజ మాలిక్’గా మోహన్ బాబు, ‘బిర్యాని’గా సంపూర్ణేష్ బాబు నటిస్తున్నారు.
ఈ సినిమాకి సంగీతం: అనిరుధ్ రవిచందర్, డైలాగ్స్: తోట శ్రీనివాస్, కెమెరా: సిహెచ్ సాయి, ఎడిటింగ్: నవీన్ నూలి, ఆర్ట్: కొల్ల చేస్తున్నారు.
దసరా సినిమా నిర్మాత చెరుకూరి సుధాకర్ తమ ఎస్ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాపై దర్శక నిర్మాతలకు చాలా భారీ అంచనాలున్నాయి. కనుక తొలిసారిగా బెంగాలీ, ఇంగ్లీష్, స్పానిష్ భాషల్లో కూడా డబ్ చేసి విడుదల చేయబోతున్నారు. ‘ది ప్యారడైజ్’ ఆగస్ట్ 21న విడుదల కాబోతోంది.