‘కోర్ట్-వర్సస్ నో బడీ’ సినిమాతో ‘కోర్టు జంట’గా పాపులర్ అయిన హర్ష్ రోషన్, శ్రీదేవి ఈసారి ‘బ్యాండ్ మేళం’తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్ ‘బ్యాండ్ మేళం’ మోత మోగించింది. తర్వాత ఈ నెల 28న ఈ సినిమా నుంచి రెండో పాట విడుదల కాబోతోంది. మాస్ మహారాజ్ రవితేజ ఈ పాటని విడుదల చేస్తారు.
ఈ సినిమాకి కధ, ఎడిటింగ్, స్క్రీన్ ప్లే: శివ ముప్పరాజు, సంగీతం: విజయ్ బులగనిన్, కెమెరా: సతీష్ ముత్యాల చేస్తున్నారు. సతీష్ జవ్వాజీ దర్శకత్వంలో కోనా ఫిల్మ్ కార్పోరేషన్ బ్యానర్‌పై కావ్య, శ్రావ్య కలిసి ఈ సినిమా నిర్మిస్తున్న ఈ సినిమా మార్చి 13న విడుదల కాబోతోంది.