పెద్ది నుంచి రెండో పాటకి ముహూర్తం ఖరారు

February 26, 2026


img

బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రామ్ చరణ్‌, జాన్వీ కపూర్‌ జంటగా చేస్తున్న ‘పెద్ది’ నుంచి విడుదలైన మొదటి పాత ‘చికిరి చికిరి’ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు అంతకంటే గొప్పగా ఉండే రెండో పాట మార్చి 2న విడుదల కాబోతున్నట్లు మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించింది. ఈ విషయం తెలియజేస్తూ రామ్‌ చరణ్‌ పోస్టర్ విడుదల చేసింది. 

ఈ సినిమాలో గ్రామీణ క్రికెట్ ఆటగాడు ‘పెద్ది’గా నటిస్తున్న రామ్ చరణ్‌కి కోచ్‌ ‘గౌరు నాయుడు’గా కన్నడ నటుడు శివరాజ్ కుమార్ నటిస్తున్నారు. ఈ సినిమాలో జగపతి బాబు, శివ రాజ్ కుమార్‌, దివ్యేంద్రు తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు. 

ఈ సినిమాకి సంగీతం: ఏఆర్ రహమాన్, కెమెరా: రత్నవేలు, ఎడిటింగ్: నవీన్ నూలి అందిస్తున్నారు. 

వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లపై వెంకట సతీష్ కిలారు దీనిని పాన్ ఇండియా మూవీగా 5 భాషల్లో నిర్మిస్తున్నారు. ఏప్రిల్‌ 30న పెద్ది ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. 


Related Post

సినిమా స‌మీక్ష