మళ్ళీ సంక్రాంతికి వస్తున్నాం: అనిల్ రావిపూడి

February 27, 2026


img

దర్శకుడు అనిల్ రావిపూడి 2025లో సంక్రాంతి పండుగకు వెంకటేష్‌తో ‘సంక్రాంతికి వస్తున్నాం’తో హిట్ కొట్టారు. 2026 సంక్రాంతి పండుగకు చిరంజీవితో ‘మన శంకర వరప్రసాద్ గారు’ని తీసుకువచ్చి హిట్ కొట్టారు. అప్పుడే మళ్ళీ సంక్రాంతికి వస్తున్నానని అనిల్ రావిపూడి చెప్పేశారు. వెంకటేష్‌, చిరంజీవిలు కూడా అనిల్ దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు సిద్ధమని ప్రకటించారు. కనుక వారి కాంబినేషన్‌లో వస్తారనుకుంటే, ఈసారి మరో కొత్త కాంబినేషన్‌తో వస్తున్నట్లు ప్రకటింఛి అందరినీ ఆశ్చర్యపరిచారు. 

అనిల్ రావిపూడి తన కొత్త సినిమా గురించి సోషల్ మీడియాలో తెలియజేస్తూ, “మొదటి “వందకోట్ల బొమ్మ” కొట్టిన హీరో.. విక్టరీ వెంకటేష్‌ గారు, “మొదటిసారి బొమ్మ” తీసే అవకాశం ఇచ్చిన హీరో నందమూరి కళ్యాణ్ రామ్‌ గారితో కలిసి 2027 మొదటి పండగకి మీ ముందుకు వస్తున్నాం,” అని ట్వీట్ చేశారు. 

సినిమాల విషయంలో అనిల్ రావిపూడి చాలా ఫాస్ట్. హీరోల పేర్లు, రిలీజ్ డేట్ ప్రకటించేశారు కనుక త్వరలోనే సినిమా టైటిల్‌, ఫస్ట్ లుక్ పోస్టర్‌, ఫస్ట్ గ్లిమ్స్‌ వరుసగా ప్రకటించేయడం ఖాయం. 


Related Post

సినిమా స‌మీక్ష