విరోష్ పెళ్ళి ఫోటోలు... చూశారా?

February 26, 2026
img

విజయ్ దేవరకొండ, రష్మిక మందనలు ప్రేమ బంధంలో నుంచి నేడు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. రాజస్థాన్‌,  ఉదయ్‌పూర్‌లోని ఐటిసి మెమొంటోస్‌లో ఈరోజు ఉదయం 10.20 గంటలకు హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహ వేడుక జరిగింది. మళ్ళీ సాయంత్రం రష్మిక కొడవ వంశాచారం ప్రకారం మరోసారి పెళ్లి చేసుకున్నారు.

వారి వివాహవేడుక ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విజయ్ దేవరకొండ పెద్ద మీసకట్టు, ఒంటి నిండా భారీ ఆభరణాలు ధరించి రాజకుమారుడిలా కనిపిస్తే, రష్మిక తెల్లటి పట్టు చీర, ఒంటినిండా నగలతో రాజకుమారిని తలపించింది.

అనేక ఏళ్ళ  ప్రేమ తర్వాత పెళ్ళి చేసుకుంటున్నారు. కనుక పెళ్ళి వేడుకలో ప్రతీ నిమిషాన్ని, ప్రతీ ఘట్టాన్ని ఇద్దరూ బాగా ఎంజాయ్ చేశారు. ఇరు కుటుంబాల పెద్దలు, సమీప బంధుమిత్రులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో అంగరంగ వైభవంగా వివాహ వేడుక ముగిసింది. మార్చి మొదటివారంలో హైదరాబాద్‌లో పెళ్ళి రిసిప్షన్ ఉంటుంది. దానికి సినీ పరిశ్రమ, రాజకీయ ప్రముఖులందరినీ ఆహ్వానించారు. 


Related Post