తెలుగు ప్రజలకు విరోష్ స్వీట్ పార్టీ

March 01, 2026
img

ఇటీవల పెళ్ళి చేసుకున్న విజయ్ దేవరకొండ, రష్మిక మందన (విరోష్) రెండు తెలుగు రాష్ట్రాలలో అభిమానులతో తమ సంతోషాన్ని పంచుకోవాలనుకున్నారు. కనుక నేడు రెండు రాష్ట్రాలలో ఎంపిక చేసిన నగరాలలో స్వీట్లు పంపిణీ , అలాగే కొన్ని దేవాలయాలలో అన్నదానం నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. 

“మీరందరూ మా సినీ ప్రయాణంలో, ప్రేమలో ఓ భాగమే. మా పెళ్ళి వేడుకలను మీతో కలిసి జరుపుకోవడం మాకు చాలా సంతోషం కలిగిస్తోంది. మనకు వేడుక అంటే స్వీట్లే. కనుక ట్రక్కుల నిండా మా ప్రేమతో నింపిన స్వీట్లు దేశవ్యాప్తంగా పంపిస్తున్నాము. మార్చి 1న ఇవి మీకు అందుతాయి. మీ అందరి ఆశీర్వాదాలు మాకు కావాలి,” అని విజయ్ దేవరకొండ, రష్మిక మందనలు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు.     

తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌, కరీంనగర్‌నేడు స్వీట్లు, అన్నదానం జరుగుతున్నాయి. ఏపీతో దేశాలో పలు రాష్ట్రాలలో నేడు స్వీట్ ప్యాకెట్లు పంపిణీ, అన్నదానాలు జరుగుతున్నాయి. వారు చెప్పినట్లుగానే వారి సందేశం, పక్కనే వారి ఫోటోతో కూడిన ఫ్లెక్సీ బ్యానర్లతో ఉన్న వాహనాలు స్వీట్ ప్యాకెట్ బాక్సులతో దేశవ్యాప్తంగా పలు నగరాలు, పట్టణాలలో ప్రత్యక్షమయ్యాయి. అభిమానులు, యువత ఉత్సాహంగా వాటిని తీసుకొని ఫోటోలు దిగి మళ్ళీ సోషల్ మీడియాలో పెడుతున్నారు. నవదంపతులను అభినందిస్తున్నారు. 

విజయ్ దేవరకొండ, రష్మిక మందన దంపతులు మొదలుపెట్టిన ఈ కొత్త సాంప్రదాయం అందరినీ ఆకట్టుకుంటోంది. నాగర్‌కర్నూల్ జిల్లా బల్మూరు మండలం తుమ్మంపేటలోని ఫామ్‌హౌసులో వారు గృహప్రవేశం, సత్యనారాయణ స్వామి వ్రతం చేయనున్నారు. ఈ కార్యక్రమం తర్వాత విచ్చేసిన అతిధులు, అభిమానులకు విందు భోజనాలు ఏర్పాటు చేయబోతున్నారు. ఈనెల 4న హైదరాబాద్‌లో భారీ రిసెప్షన్ పార్టీ ఇవ్వనున్నారు. దీనికి సినీ రాజకీయ,  ప్రముఖులు లను ఆహ్వానించారు. 


Related Post