ఇళ్ళలో నుంచి బయటకు రావద్దు: సిఎం రేవంత్‌

March 01, 2026


img

ఇరాన్‌-అమెరికా-ఇజ్రాయెల్ మద్య ఇంకా యుద్ధం కొనసాగుతుండటంతో గల్ఫ్ దేశాలలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపధ్యంలో తెలంగాణ సిఎం రేవంత్‌ రెడ్డి గల్ఫ్ దేశాలలో ముఖ్యంగా ఇరాన్‌లో పనిచేస్తున్న తెలుగు వారికి ఓ విజ్ఞప్తి చేశారు. అందరూ అప్రమత్తంగా ఉంటూ భద్రతా మార్గదర్శకాలను తూచా తప్పకుండా పాటించాలి.

పరిస్థితి పూర్తిగా చక్కబడేవరకు ఎవరూ ఇళ్ళలో నుంచి బయటకు రావద్దు. ఒకవేళ ఎవరైనా అత్యవసరంగా బయటకు వస్తే తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇరాన్‌తో సహా యుద్ధ ప్రభావం ఉన్న గల్ఫ్ దేశాల నుంచి తెలుగు వారిని వెనక్కు రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతున్నాము.

ముఖ్యంగా అక్కడ పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగుల వివరాలు సేకరించి అవసరమైన చర్యలు చేపడుతాము. గల్ఫ్ దేశాలలో పరిస్థితిని నిరంతరంగా సమీక్షిస్తున్నామని సిఎం రేవంత్‌ రెడ్డి చెప్పారు.


Related Post