నేడు సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఆలయాలు మూసివేస్తున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి వారి ఆలయాన్ని ఈరోజు ఉదయం 9 నుంచి రాత్రి 7.30 గంటల వరకు మూసివేస్తారు. అలాగే యాదాద్రి, వేములవాడతో సహా రాష్ట్రంలో పలు ఆలయాలు నేడు మూసివేస్తారు. గ్రహణం పూర్తయిన తర్వాత సంప్రోక్షణ చేసి మళ్ళీ భక్తులను దర్శనాలకు అనుమతిస్తారు.
అయితే సూర్య, చంద్ర గ్రహణాల రోజుల్లో కూడా తెరిచి ఉండే ఆలయం తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తి. నేడు ఈ ఆలయంలో రాహుకేతు పూజలు నిర్వహిస్తారు. యధాప్రకారం భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు.
ఈరోజు మధ్యాహ్నం 3.20 గంటలకు గ్రహణం ప్రారంభమై సాయంత్రం 6.46 గంటలకు ముగుస్తుంది. గ్రహణ సమయం 3.27 గంటలన్న మాట!