పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరచూ అనారోగ్యానికి గురవుతుండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇటీవల కొడుకు అఖిరా నందన్‌తో కలిసి కేరళ, తమిళనాడు రాష్ట్రాలలో తీర్ధ యాత్రలు చేసి వచ్చారు. అప్పటికే కొంత అస్వస్థతగా ఉన్నారు. అయినా sసతీసమేతంగా మహా కుంభమేళాకు వెళ్ళి త్రివేణీ సంగమంలో స్నానాలు చేసి వచ్చారు. ఆ తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వెళ్ళారు. హైదరాబాద్ తిరిగి రాగానే వైరల్ ఫీవర్ మొదలైంది.
కనుక హైదరాబాద్ అపోలో హాస్పిటల్లో చేరి చికిత్స తీసుకుంటున్నారు. వైద్యులు కొన్ని పరీక్షలు చేశారు. మరికొన్ని వైద్య పరీక్షలు చేయాల్సి ఉంది. కానీ సోమవారం నుంచి ఏపీ శాసనసభ బడ్జెట్ సమావేశాలు మొదలవుతున్నందున వాటికి హాజరవ్వాలని నిర్ణయించుకున్నారు. శాసనసభ సమావేశాలు ముగిసిన తర్వాత మిగిలిన వైద్య పరీక్షలు తర్వాత చేయించుకుంటారని జనసేన తెలియజేసింది.