హైదరాబాద్‌లో ఆదర్శ కుటుంబం ఫైటింగ్?

April 18, 2026


img

విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌  కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం: హౌస్ నం: 47, ఏకే 47’ షూటింగ్‌  చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో వెంకటేష్‌ ఇతర తారాగణం మీద కొన్ని యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ నెలాఖరులోగా షూటింగ్‌, వచ్చే నెలలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తిచేసి, జూన్‌లో సినిమా విడుదల చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. 

క్రైమ్-ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిస్తున్న ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47లో వెంకటేష్‌ భార్యగా శ్రీనిధి శెట్టి నటిస్తున్నారు. హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్.రాధాకృష్ణ  నిర్మిస్తున్న ఈ సినిమాకి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. 


Related Post

సినిమా స‌మీక్ష