తమిళనాడు శాసనసభ ఎన్నికలలో అధికార డీఎంకే పార్టీ పూర్తి మెజార్టీతో అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ సూచించాయి. అలాగే డీఎంకే, అన్నాడీఎంకే, టివికే మూడు పార్టీలకు సమానంగా సీట్లు వచ్చే అవకాశం ఉందని మరికొన్ని సూచించగా, టివికే పార్టీ పూర్తి మెజార్టీతో అధికారంలోకి వస్తుందని కొన్ని సర్వేలు సూచించాయి.
తమిళనాడులో ఇప్పటి వరకు జరిగిన ఓట్ల లెక్కింపు ప్రకారం అధికార డీఎంకే:56, అన్నాడీఎంకే: 78, టివికే: 99 స్థానాలలో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.
టీవీకే పార్టీ క్రమంగా పుంజుకొంటుండటం గమనిస్తే ఆ పార్టీ పూర్తి మెజార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. విజయ్ తొలిసారిగా ఎన్నికల బరిలో దిగి విజయం సాధించి అధికారంలోకి రాగలిగితే తమిళనాడు రాజకీయాలలో విజయ్ శకం మొదలైనట్లే.