బెంగాల్లో బిజేపి పక్కా, తమిళనాడులో టీవీకే?

May 04, 2026


img

నాలుగు రాష్ట్రాలు, పుదుచ్చేరి శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపులో వివిధ పార్టీల ఆధిక్యతలతో ఆయా రాష్ట్రాలలో ఏయే పార్టీలు అధికారంలోకి రాబోతున్నాయో దాదాపు స్పష్టమయ్యింది. 

ఇంతవరకు పూర్తయిన ఓట్ల లెక్కల ప్రకారం పశ్చిమ బెంగాల్లో 293 స్థానాలలో బిజేపి 178, తమిళనాడులో 234 స్థానాలలో  టీవీకే పార్టీ 107, కేరళంలో 140 స్థానాలలో యూడీఎఫ్ 98, అస్సాంలో 126 స్థానాలలో బిజేపి 98, పుదుచ్చేరిలో 30 స్థానాలలో ఎన్నార్ కాంగ్రెస్‌ 44 స్థానాలలో ఆధిక్యంలో ఉన్నాయి. 

పశ్చిమ బెంగాల్లో 148 సీట్లు, తమిళనాడులో 118 సీట్లు, కేరళంలో 71 సీట్లు, అస్సాంలో 64 సీట్లు, పుదుచ్చేరిలో 16 సీట్లు దక్కించుకుంటే చాలు.. ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చు. కనుక  బెంగాల్లో బిజేపి ఎన్నికలలో గెలిచి అధికారంలోకి రావడం ఖాయమైపోయినట్లే. తమిళనాడులో టీవీకే పార్టీ 107 వరకు వచ్చింది. కనీసం మరో 10 సీట్లు గెలుచుకోగలిగితే విజయ్‌ దళపతి సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయగలుగుతారు.


Related Post