ట్రంప్‌ కొత్త మెలిక!

April 12, 2026


img

అమెరికా-ఇరాన్‌ చర్చలు విఫలమవడంతో ట్రంప్‌ భగ్గుమన్నారు. కానీ మొదట హెచ్చరించినట్లు ఇరాన్‌ మీద దాడులకు తెగబడ లేదు. రూట్ మార్చి హోర్మూజ్ జలసంధి గుండా ప్రపంచ దేశాల చమురు, గ్యాస్, సరుకు రవాణా నౌకలపై నిషేధం విధించారు.

ఇక నుంచి హోర్మూజ్ జలసంధి ద్వారా నౌకలను అనుమతించబోమని, అలాగే అటువైపు వెళ్ళేందుకు కూడా అనుమతించబోమని ట్రంప్‌ ప్రకటించారు. హోర్మూజ్ జలసంధిలోకి ప్రవేశించే ఏ దేశపు నౌకనైనా అడ్డుకుంటామని ట్రంప్‌ ప్రకటించారు. ఈ నిషేధం తక్షణం అమలులోకి వచ్చిందని ట్రంప్‌ ప్రకటించారు.

హోర్మూజ్ జలసంధి గుండా ప్రయాణించేందుకు ఇరాన్‌ సుంకం వసూలు చేసుకుంటోంది. దాని ద్వారా భారీగా ఆదాయం సమకూరుతోంది. కనుక దాని ఆదాయానికి గండి కొడితే, ఇరాన్‌ కాళ్ళ బేరానికి వస్తుందని ట్రంప్‌ ఆలోచనగా కనిపిస్తోంది.

కానీ హోర్మూజ్ జలసంధి గుండా చైనా, భారత్‌, రష్యా నౌకలు కూడా రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ విషయంలో సమస్య తలెత్తకుండా భారత్‌ ప్రత్యామ్నాయం చూసుకోవచ్చు. కానీ చైనా, రష్యాలు మాత్రం తమ నౌకలను అమెరికా యుద్ధ నౌకలు అడ్డుకుంటే ఎదురుదాడి చేస్తే పరిస్థితి ఏమిటి? అని ట్రంప్‌ ఆలోచించారో లేదో? లేదా ఆ రెండు దేశాలకు మినహాయింపు ఇచ్చేస్తారో?


Related Post