ఇంటర్ ఫలితాలు: మళ్ళీ బాలికలే టాప్!

April 12, 2026


img

తెలంగాణ ఇంటర్ ప్రధమ, ద్వితీయ ఫలితాలు నేడు వచ్చేశాయి. ఎప్పటిలాగే ఈసారి కూడా బాలికలే టాప్! ప్రధమ సంవత్సరం పరీక్షా ఫలితాలలో బాలికల ఉత్తీర్ణత శాతం 74.4 కాగా బాలుర ఉత్తీర్ణత శాతం  57.68. ద్వితీయ సంవత్సరం ఫలితాలలో బాలికల ఉత్తీర్ణత శాతం 78.65 కాగా బాలుర ఉత్తీర్ణత శాతం 62.50. 

మొత్తం 4,89,123 మంది విద్యార్ధులు ఇంటర్ ప్రధమ పరీక్షలు వ్రాయగా వారిలో 3,23,807 మంది ఉత్తీర్ణులయ్యారు. అంటే 66.2 శాతం అన్నమాట! అదేవిధంగా మొత్తం 5,07,948 మంది విద్యార్ధులు ఇంటర్ ద్వితీయ పరీక్షలు వ్రాయగా వారిలో 3,58,490 మంది (70.34 శాతం) ఉత్తీర్ణులయ్యారు.

ఇంటర్ జనరల్ 66.94 శాతం, ఒకేషనల్ 59.30 శాతం ఉత్తీర్ణత సాధించారు. 

ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో బీసీ గురుకుల పాఠశాలలో ఇంటర్ ప్రధమలో 86 శాతం, ద్వితీయలో 90 శాతం, ఒకేషనల్‌  96శాతం ఉత్తీర్ణత సాధించారు. 

ప్రైవేట్ మరియు అన్ ఎయిడెడ్ జూనియర్ కాలేజీలలో ఇంటర్ ప్రధమ (జనరల్) 77 శాతం, ద్వితీయ 71 శాతం, ఒకేషనల్ 65 శాతం ఉత్తీర్ణత సాధించారు.

ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్: 

ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్ధుల కోసం నిర్వహించే సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ ఈవిధంగా ఉంది. 

మార్కులు రీకౌంటింగ్ మరియు వెరిఫికేషన్: ఏప్రిల్‌ 13-20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లింపు: ఏప్రిల్‌ 13 నుంచి 20 వరకు గడువు.

అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణ: మే 13 నుంచి ప్రారంభం. (రోజుకి రెండు సెషన్స్)

అడ్వాన్స్ ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణ: మే 22 నుంచి ప్రారంభం. (రోజుకి రెండు సెషన్స్). 


Related Post