అమెరికా-ఇరాన్‌ చర్చలు విఫలం!

April 12, 2026


img

పాకిస్తాన్‌ మధ్యవర్తిత్వంతో శనివారం ఇస్లామాబాద్‌లో అమెరికా-ఇరాన్‌ ప్రతినిధుల మద్య సుదీర్గంగా సాగిన చర్చలు విఫలమయ్యాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇదే విషయం మీడియాకు తెలియజేసి తన బృందంతో నిన్న రాత్రి అమెరికా తిరుగు ప్రయాణమయ్యారు.

"మా షరతులకు ఇరాన్‌ అంగీకరించలేదు. ఇరాన్‌ మొండిగా వ్యవహరిస్తోంది తప్ప యుద్ధం ముగిసి శాంతి ఏర్పడాలని కోరుకోవడం లేదు. ఇది చాలా దురదృష్టకరం. మేము నిరాశతో అమెరికా తిరిగి వెళ్ళిపోతున్నాము. ఇరాన్‌కు, మాకు, ప్రపంచదేశాలకు కూడా ఇది మంచిది కాదు," అని జేడీ వాన్స్ అన్నారు.

అమెరికా-ఇరాన్‌ శాంతి చర్చలు విఫలమైతే ఇరాన్‌పై మళ్ళీ భీకరదాడులు చేస్తామని ట్రంప్‌ ముందే హెచ్చరించారు. కనుక మళ్ళీ నేటి నుంచే ఇరాన్‌ మీద అమెరికా-ఇజ్రాయెల్‌ దాడులు మొదలుపెడతాయి. కనుక అవి చేసే మారణహోమంలో ఇరాన్‌ ప్రజలు బలవక తప్పదు.

చమురు, గ్యాస్ కొరతతో ధరలు ఇంకా పెరగక మానవు. కనుక భారత్‌తో సహా ప్రపంచ దేశాలన్నీ మూల్యం చెల్లించక తప్పదు. నాడు కరోనా, లాక్ డవున్ వలన దేశంలో ఏవిధంగా చిన్న, మద్య, భారీ వ్యాపారాలు నష్టపోయాయో మళ్ళీ ఇప్పుడు అదే జరుగబోతోంది. ఇప్పటికే టిఫిన్ సెంటర్స్, హోటల్స్‌ మూత పడ్డాయి. యుద్ధం మొదలైతే మిగిలినవి కూడా మూతపడతాయేమో? 


Related Post