తెలంగాణ ఇంటర్మీడియేట్ ప్రధమ, ద్వితీయ పరీక్షా ఫలితాలు నేడు (అదివారం) ప్రకటిస్తామని ఇంటర్మీడియేట్ బోర్డ్ తెలియజేసింది. ప్రధమ, ద్వితీయ కలిపి 9.5 లక్షల మందికి పైగా విద్యార్ధులు పరీక్షలు వ్రాశారు. వారు ఇంటర్ బోర్డ్ అధికారిక వెబ్‌సైట్: https://tgbie.cgg.gov.in/ లో తమ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేస్తే పరీక్ష ఫలితాలు పొందవచ్చు. లేదా విద్యార్ధులు తమ రిజిస్టర్డ్ మొబైల్ ఫోన్ నుంచి 80969 58096 నంబరుకి ‘Hi’ అని ఇంగ్లీషులో మెసేజ్ చేసి తర్వాత BIE Exam Result అని మెసేజ్ చేస్తే, వెంటనే ఫలితాలు ఫోన్లోకి వస్తాయి. ఇవి కాక దాదాపు అన్ని ఆన్‌లైన్ వార్తాపత్రికలు, మన బడి వంటి పలు వెబ్‌సైట్లలో కూడా ఫలితాలు చూసుకోవచ్చు.
ఇంటర్ ఫలితాలు ప్రకటించిన తర్వాత సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ వెలువడుతుంది.