సాంప్రదాయిని సుప్పిని సుద్ధపూసని... రిలీజ్ ట్రైలర్‌!

March 03, 2026


img

శివాజీ, లయ, రోహన్ రాయ్ ప్రధాన పాత్రలు చేసిన ‘సాంప్రదాయిని సుప్పిని సుద్ధపూసని’ క్రైం కామెడీ సినిమా ఈ నెల 6న నేరుగా ఈటీవి విన్ ఓటీటీలోనే విడుదల కాబోతోంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతోంది కనుక ఈ మద్యనే ఓ ట్రైలర్‌ వదిలారు. అది అదిరిపోయింది. ఇప్పుడు రిలీజ్ ట్రైలర్‌ అంటూ మరో ట్రైలర్‌ వదిలారు. అదికూడా అదిరిపోయింది. 

ఈ సినిమాలో శివాజీ, లయ భార్య భర్తలుగా నటించగా బాలీవుడ్‌ నటుడు రోహన్ రాయ్ వారి కుమారుడుగా నటించారు. ప్రిన్స్, జబర్దస్త్ ఇమ్మానుయేల్, రాజ్ తిరందాసు, కరణ్ తదితరులు ఈ సినిమాలో ముఖ్యపాత్రలు చేశారు.

ఈ సినిమాకు కధ దర్శకత్వం: సుదీర్ శ్రీరాం, సంగీతం:రంజిన్ రాజ్,  కెమెరా:రిత్విక్ రెడ్డి, ధీరజ్ పి, ఎడిటింగ్: బాలు మనోజ్ చేశారు. శ్రీశివాజీ ప్రొడక్షన్ బ్యానర్‌పై శివాజీ స్వయంగా నిర్మించి ప్రధాన పాత్ర చేశారు.        


Related Post

సినిమా స‌మీక్ష