సీనియర్ జర్నలిస్ట్ విఎస్ఎన్ మూర్తిపై సస్పెన్షన్ వేటు

March 03, 2026


img

రెండు తెలుగు రాష్ట్రాలలో అందరికీ చిర పరిచితులైన సీనియర్ జర్నలిస్ట్ విఎస్ఎన్ మూర్తిపై సస్పెన్షన్ వేటు పడింది. ఆయన తన సోషల్ మీడియాలో సాటి జర్నలిస్టులని ఉద్దేశ్యించి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నందున తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ నుంచి మూడు నెలలపాటు సస్పెండ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. 

గతంలో కూడా అయన ఇదేవిధంగా సాటి జర్నలిస్టుల పట్ల అనుచితంగా, చులకనగా వ్యవహరించేవారని ఆ లేఖలో పేర్కొంది. అప్పుడూ ఇదేవిధంగా హెచ్చరిస్తే అయన క్షమాపణలు చెప్పుకున్నారని కానీ మళ్ళీ అలాగే ప్రవర్తిస్తున్నారని, అందువల్లే ఈ కటిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ తెలియజేసింది. 

కనుక సినీ పరిశ్రమలో అందరూ, పీఆర్ఓలు అసోసియేషన్‌ నిర్ణయాన్ని గౌరవించి ఆయన్ని మూడు నెలల పాటు తమ సినీ కార్యక్రమాలకు ఆహ్వానించవద్దని ఆ లేఖలో విజ్ఞప్తి చేసింది. 

ఒక సీనియర్ జర్నలిస్ట్ సాటి జర్నలిస్టులకు మార్గదర్శనం చేయకపోయినా పర్వాలేదు. కానీ వారి పట్ల చులకనగా వ్యవహరించడాన్ని ఎవరూ హర్షించలేరు. తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ నిర్ణయంపై ఆయన ఇంకా స్పందించాల్సి ఉంది. 



Related Post