వికారాబాద్ అనంతగిరిలో ఏపీ, తెలంగాణ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారినుద్దేశ్యించి మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
మనం ఎన్నికల సమయంలో మాత్రమే ప్రజల మధ్యకు వెళుతున్నాం. కానీ బిజేపి ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని నిరంతరం పనిచేస్తుంటుంది. కనుక కాంగ్రెస్ శ్రేణులు కూడా నిరంతరం ప్రజల మద్య ఉండాలి. ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తూ ప్రజల మెప్పు పొందాలి.
అమెరికాకు, అంబానీ, అదానీల కనుసన్నలలో మోడీ ప్రభుత్వం పనిచేస్తోంది. వారికి దేశ ప్రయోజనాలను తాకట్టు పెడుతోంది. ప్రజల మద్య మత చిచ్చు రగిలిస్తూనే ఉంది. మోడీ ప్రభుత్వ తీరుతో దేశ ప్రజలు వేసారిపోయి ఉన్నారు. కనుక భవిష్యత్ మనదే.
ప్రజలు మనకే అధికారం అప్పజెప్పుతారు. ఇప్పుడు డీసిసి అధ్యక్షులుగా ఉన్నవారికి భవిష్యత్‌లో ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి పదవులు లభించే అవకాశం ఉంది. కనుక అందరూ కష్టపడి పనిచేయండి. మంచి పేరు తెచ్చుకోండి. ఇలాంటి తప్పుడు పనులు చేయొద్దు. వివాదాలలో తల దూర్చొద్దు,” అంటూ రాహుల్ గాంధీ హితోపదేశం చేశారు.