వృషకర్మ ఫస్ట్ గ్లిమ్స్‌ గురువారం మధ్యాహ్నం 12.12 గంటలకు

March 03, 2026

img

కార్తీక్ దండు దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా చేస్తున్న ‘వృషకర్మ’పై చాలా భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా ఫస్ట్ గ్లిమ్స్‌ హైదరాబాద్‌లోని ప్రసాద్ పీసి ఎక్స్‌ప్రెస్‌ స్క్రీన్‌లో మార్చి 5న మధ్యాహ్నం 12.12 గంటలకు విడుదల కాబోతోంది.

“ఈ రోజు సంపూర్ణ చంద్రగ్రహణం యాదృచ్చికం కాదు...  ది రైజ్ ఆఫ్ వృషకర్మకి నేటి నుంచే కౌంట్ డౌన్ ప్రారంభం” అంటూ ఓ వీడియో పోస్ట్ చేశారు.

ఓ దట్టమైన అడవిలో నిధి కోసం సాగే సాహసోపేతమైన అన్వేషణే ఈ సినిమా కధ. ఈ సినిమాలో నాగ చైతన్యకు జంటగా మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు స్పర్ష్ శ్రీవాత్సవ్ (‘లాఫతా లేడీస్) ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్ర చేస్తున్నాడు.

ఈ సినిమాకు కధ, దర్శకత్వం: కార్తీక్‌ దండు, స్క్రీన్ ప్లే: సుకుమార్, సంగీతం: అజనీష్ బి లోక్‌నాధ్, కెమెరా: నైల్ డి కునహా, ఎడిటింగ్: నవీన్ నూలి చేస్తున్నారు.

బాపినీడు సమర్పణలో శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బివిఎస్ఎన్ ప్రసాద్‌ ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ సినిమా నిర్మాణంలో సుకుమార్ రైటింగ్స్ కూడా భాగస్వామిగా ఉండటంతో భారీ అంచనాలున్నాయి. ఈ వేసవిలో సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది.

This Eclipse is not a coincidence.🌔
It’s a SIGNAL.

THE COUNTDOWN BEGINS for THE RISE OF #VRUSHAKARMA ⏳#VrushakarmaGlimpse on MARCH 5th, 2026 at 12:12 PM❤️‍🔥

Witness it on the iconic Prasads PCX Screen, Hyderabad at the Grand Launch for the ultimate experience 🔥🔥🔥… pic.twitter.com/uLtYsYfZ81
— Sukumar Writings (@SukumarWritings) March 3, 2026

Related Post

సినిమా స‌మీక్ష