అగ్నిగుండంలో తోపులాట... పలువురికి గాయాలు!

March 04, 2026
img

నల్గొండ జిల్లాలో ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో విషాదం సంభవించింది. జిల్లాలోని వేములపల్లి మండలంలోని ఆమనగల్లు గ్రామంలో శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామీ వారి ఆలయం ఉంది. ఏటా స్వామివారి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తుంటారు.

వాటిలో భాగంగా పెద్ద అగ్నిగుండం ఏర్పాటు చేస్తారు. కణకణ మండే ఆ అగ్నిగుండంపై పాదరక్షలు ధరించకుండా నడిచి భక్తులు స్వామివారికి మొక్కు చెల్లించుకుంటారు. నిన్న రాత్రి జరిగిన ఈ కార్యక్రమం పలువురు భక్తులు అగ్నిగుండంపై నడిచారు.

కానీ ఒకేసారి కొంతమంది వరుసగా నడుస్తున్నప్పుడు వెనుక నడుస్తున్నవారిలో కొందరు భయపడ్డారు. దాంతో వేగంగా ముందుకు సాగే ప్రయత్నంలో చిన్నగా తోపులాట జరిగింది. దీంతో గుండం మద్యలో ఉన్న భక్తులందరూ దానిలో పడిపోయారు.

చుట్టూ ఉన్న స్థానికులు వెంటనే వారిని బయటకు లాగి కాపాడారు. ఈ ప్రమాదంలో పలువురికి తీవ్రంగా కాలిన గాయాలు కాగా మరి కొందరు తోపులాటలో కిందపడటం వలన గాయపడ్డారు. క్షతగాత్రులందరినీ గ్రామస్తులు హుటాహుటిన ఆసుపత్రికి తరలింఛి సకాలంలో చికిత్స అందించడంతో అందరూ ప్రాణాలతో బయటపడ్డారు.

Related Post