కిషోర్ తిరుమల దర్శకత్వంలో రవితేజ, ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి హీరో హీరోయిన్లుగా చేసిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ జనవరి 13న థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను అలరించింది. ఇప్పుడీ సినిమా ఈ నెల 13 నుంచి జీ5లో ప్రసారం కాబోతోంది. కనుక ఓటీటీ ప్రేక్షకులు కూడా చూసి ఆనందించవచ్చు.
ఈ సినిమాలో వెన్నెల ప్రశాంత్ కిషోర్, సునీల్, సత్య, శుభలేఖ సుధాకర్, మురళీధర్ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకి కధ, దర్శకత్వం: కిషోర్ తిరుమల,సంగీతం: భీమ్స్ సిసిరోలియో, కెమెరా: ప్రసాద్ మూరెళ్ళ, ఎడిటింగ్: ఏ శ్రీకర్ ప్రసాద్, ఆర్ట్: ఈ సందర్భంగా ప్రకాష్ చేస్తున్నారు. ఎస్ఎల్‌వీ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ సినిమా నిర్మించారు.