నందమూరి బాలకృష్ణ తన 111వ సినిమా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేయబోతున్నారు. ఈ నెల 6 నుంచి రామానాయుడు స్టూడియోలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించబోతున్నారు. చారిత్రిక నేపధ్యంతో తీస్తున్న ఈ సినిమాలో బాలకృష్ణకు జోడీగా నయనతార నటించబోతున్నారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై సతీష్ కిలారు ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
ఈ సినిమా షూటింగ్ ఇంకా ప్రారంభించాక ముందే బాలకృష్ణ తన తదుపరి సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఇటీవల దర్శకుడు వివేక్ ఆత్రేయ బాలకృష్ణని కలిసి కధ చెప్పగా అయన వెంటనే ఓకే చెప్పెసినట్లు తాజా సమాచారం.
గోపీచంద్ మలినేనితో ఎన్‌బీకే 111వ సినిమా షూటింగ్ ఈ ఏడాది జూన్-జూలై నాటికి పూర్తయ్యే అవకాశం ఉంటుంది. కనుక అది పూర్తికాగానే వివేక్ ఆత్రేయతో 113వ సినిమా మొదలుపెడితే, ఈ ఏడాది నవంబర్‌లోగా పూర్తయ్యే అవకాశం ఉంటుంది. కనుక ఈ ఏడాది బాలయ్య నుంచి రెండు సినిమాలు విడుదలయ్యే అవకాశం ఉంది.