హరీష్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఈ నెల 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. అంటే పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలెట్టాల్సిన సమయమన్న మాట! ఇలాంటి సమయంలో ‘ఉస్తాద్’ గురించి ఓ కొత్త విషయం వినిపిస్తోంది. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో సంగీత దర్శకుడు తమన్‌ని కూడా రంగంలో దించినట్లు టాక్.
దేవిశ్రీ ప్రసాద్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అంత పవర్ ఫుల్‌గా లేకపోవడం వలన తమన్‌కి ఆ బాధ్యత అప్పగించినట్లు తెలుస్తోంది.
గతంలో ‘వకీల్ సాబ్’, ‘భీమ్లా నాయక్’ సినిమాలకు థమన్ అందించిన బీజీఎం అదిరిపోయింది. ‘ఉస్తాద్’ తర్వాత పవన్ కళ్యాణ్ మళ్ళీ మరో సినిమా చేసేందుకు చాలా సమయం పట్టవచ్చు. మరొకటి చేయగలరో లేదో కూడా తెలీదు. కనుక పవన్ కళ్యాణ్ చేసిన వాటిలో ఇదే చివరి సినిమాగా నిలుస్తుంది. కనుక దీనిపై అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తోంది కనుక దీనిపై చాలా భారీ అంచనాలే ఉన్నాయి. కనుక దీనిలోకి తమన్‌ని తెచ్చినట్లు సమాచారం. మీడియా, సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ అవుతోంది. కానీ ‘ఉస్తాద్’ టీమ్ ఇంకా ద్రువీకరించాల్సి ఉంది.
ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ నటిస్తున్న పవన్ కళ్యాణ్‌కు జోడీగా శ్రుతీ హాసన్ నటిస్తున్నారు. ఈ సినిమాకి కధ, దర్శకత్వం: హరీష్ శంకర్, స్క్రీన్ ప్లే: కె.దశరద్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమెరా: ఆయాంకా బోస్, ఎడిటింగ్: ఉజ్వల్ కులకర్ణి చేస్తున్నారు.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, రవి శంకర్ యలమంచిలి కలిసి నిర్మిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్ మార్చి 26న విడుదల కాబోతోంది.