ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా చేస్తున్న ‘ఎపిక్-ఫస్ట్ లుక్ పోస్టర్ సెమిస్టర్’ నుంచి సంచారమే అంటూ సాగే మొదటి లిరికల్ వీడియో సాంగ్ ఈ నెల 7న ఉదయం11.08 గంటలకు విడుదల కాబోతోంది. గోరేటి వెంకన్న వ్రాసిన ఈ పాటని హేషం అబ్దుల్ వాహేబ్ స్వరపరిచి ఆయనతో కలిసి పాడారు.
ఈ సినిమాకు కధ, దర్శకత్వం: ఆదిత్య హాసన్, సంగీతం: హేషం అబ్దుల్ వాహేబ్, కెమెరా: అజీం మొహమ్మద్, ఎడిటింగ్: నవీన్ నూలి చేస్తున్నారు.
శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితారా ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగావంశీ, సాయి సౌజన్య కలిసి నిర్మిస్తున్నారు.