నేడు ఢిల్లీకి సిఎం రేవంత్‌... రాత్రికి రాజ్యసభ అభ్యర్ధులు ఖరారు?

March 04, 2026


img

మరికొద్ది సేపటిలో సిఎం రేవంత్‌ రెడ్డి ఢిల్లీ బయలుదేరి వెళుతున్నారు. తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలకు నామినేషన్ గడువు రేపటితో ముగుస్తుంది. కనుక కాంగ్రెస్‌ అధిష్టానంతో చర్చించి అభ్యర్ధులను ఖరారు చేసేందుకు వెళుతున్నారు. 

ఢిల్లీలో కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ, జాతీయ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్‌తో సమావేశమై అభ్యర్ధుల గురించి చర్చించి ఖరారు చేస్తారు. రెండు సీట్లకు సిట్టింగ్ ఎంపీ అభిషేక్ సింఘ్వీతో సహా మొత్తం 16 మంది పోటీ పడుతున్నారు. అభిషేక్ సింఘ్వీకి మళ్ళీ అవకాశం కల్పించవచ్చని సమాచారం. ఈరోజు రాత్రి లేదా రేపు ఉదయం ఇద్దరు అభ్యర్ధుల పేర్లు ప్రకటించనున్నారు.  



Related Post