బిహార్‌ సిఎం నితీష్ కుమార్‌ రాజీనామా!

March 05, 2026


img

రెండు దశాబ్దాలుగా బిహార్‌ రాజకీయాలను కంటి చూపుతో శాశిస్తున్న సిఎం నితీష్ కుమార్‌ నేడు తన పదవికి రాజీనామా చేయబోతున్నారు. నేడు ఆయన రాజ్యసభ సభ్యుడుగా నామినేట్ కాబోతున్నారు. ఈరోజు గవర్నర్‌ని కలిసి రాజీనామా పత్రం సమర్పిస్తారు.

ఈ విషయం ఆయన ‘ఎక్స్‌’లో ప్రకటించారు. బిహార్‌లో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలో ఉంది. ఎన్నికల సమయంలోనే బిహార్‌ ముఖ్యమంత్రి పదవి బిజేపికి దక్కుతుందని ఊహాగానాలు వినిపించాయి. బిజేపి-జేడీయు పార్టీల మద్య ఒప్పందం ప్రకారం, బిహార్‌ సిఎం పదవికి బదులుగా అయనని కేంద్ర మంత్రి వర్గంలోకి తీసుకోబోతున్నట్లు సమాచారం.

కేంద్ర మంత్రి పదవి చేపట్టాలంటే పార్లమెంట్ ఉభయసభలలో ఏదో ఒక సభలో తప్పనిసరిగా సభ్యుడుగా ఉండాలి. దేశవ్యాప్తంగా 37 రాజ్యసభ సీట్లు భర్తీ చేయాల్సి ఉంటుందని ముందే తెలుసు కనుక ఇంతకాలం నితీష్ కుమార్‌ సిఎంగా కొనసాగారనుకోవచ్చు.

ఆయన సిఎం కుర్చీ ఖాళీ చేయడంతో ఇప్పుడు బిహార్‌ బిజేపికి దక్కబోతున్నట్లు సమాచారం. ఇదే కనుక జరిగితే ఈరోజు కోసం బిజేపి చాలా ఏళ్ళపాటు చాలా ఓపికగా ఎదురు చూసింది. చివరికి దాని నిరీక్షణ, ప్రయత్నాలు ఫలించి బిహార్‌ రాష్ట్ర పగ్గాలు బిజేపి చేతికి రాబోతున్నాయి.  


Related Post