విజయ్, త్రిష జంటగా... సినిమా కాదు పెళ్ళికి!

March 06, 2026


img

కోలీవుడ్‌ అగ్రనటుడు విజయ్ దళపతికి ఇటీవల ఆయన భార్య సంగీత విడాకులు నోటీస్ పంపిన సంగతి తెలిసిందే. ఆయనకు వేరే మహిళతో అక్రమ సంబంధం ఉన్నందున విడాకులు కోరినట్లు సమాచారం. ఇటీవలే తమిళనాడు బిజేపి అధ్యక్షుడు నాగేంద్రన్ కూడా విజయ్-త్రిషల మద్య సంబంధం గురించి వ్యాఖ్యలు చేశారు. దానిపై త్రిష తీవ్రంగా స్పందిస్తూ ఆయనకు లీగల్ నోటీస్ పంపారు. రాజకీయాలలోకి తన పేరు లాగితే సహించబోనని దానిలో హెచ్చరించారు.  దాంతో ఆయన క్షమాపణ చెప్పి కేసు నుంచి తప్పించుకున్నారు. కానీ నిన్న చెన్నైలో ఓ నిర్మాత కొడుకు పెళ్ళికి విజయ్-త్రిష ఒకే కారులో కలిసి వచ్చి వధూవరులను ఆశీర్వదించి వెళ్ళారు. తద్వారా సంగీత ఆరోపణలు, అన్నాదురై చేసిన వ్యాఖ్యలు నిజమే అని వారే స్వయంగా ధ్రువీకరించినట్లయింది. భార్యతో విడాకులకు విజయ్ కూడా సిద్దంగానే ఉన్నారు. ఆమెకు సుమారు రూ.250 కోట్లు భరణంగా ఇచ్చేందుకు సంసిద్దత వ్యక్తం చేసినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 


Related Post

సినిమా స‌మీక్ష