అచ్చియమ్మకు బుచ్చిబాబు పుట్టినరోజు శుభాకాంక్షలు!

March 06, 2026
img

నేడు జాన్వీ కపూర్‌ పుట్టినరోజు సందర్భంగా పెద్ది టీమ్‌ ఓ స్పెషల్ వీడియో రిలీజ్ చేసింది. దానిలో కాటుక అక్కరలేని ఆ కళ్ళు... ముక్కు పుడక అవసరం లేని ఆ ముక్కు... అంటూ పెద్ది సినిమాలోని ఆమె నటించిన దృశ్యాలను అభిమానులతో షేర్ చేశారు.   

బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రామ్ చరణ్‌, జాన్వీ కపూర్‌ జంటగా చేస్తున్న ‘పెద్ది’ నుంచి మొన్ననే విడుదలైన ‘రయ్ రయ్ రారా...’ అంటూ సాగే రెండో పాట కూడా మంచి వ్యూస్, లైక్స్ వస్తున్నాయి. ఈ సినిమాలో ప్రముఖ కన్నడ నటుడు శివరాజ్ కుమార్‌, జగపతి బాబు, దివ్యేంద్రు తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు. 

ఈ సినిమాకి సంగీతం: ఏఆర్ రహమాన్, కెమెరా: రత్నవేలు, ఎడిటింగ్: నవీన్ నూలి అందిస్తున్నారు. 

వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లపై వెంకట సతీష్ కిలారు దీనిని పాన్ ఇండియా మూవీగా 5 భాషల్లో నిర్మిస్తున్నారు. ఏప్రిల్‌ 30న పెద్ది ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. 

Related Post