ఇరాన్‌ తర్వాత మరో యుద్ధం ఉంది: ట్రంప్‌

March 06, 2026
img

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ ఇటీవల భారీ చమురు నిక్షేపాలున్న వెనెజువేల మీదకు తన దళాలను పంపించి ఆ దేశాధ్యక్షుడు, అయన భార్యని ఎత్తుకు వచ్చేశారు. ఆ దేశంలో చమురు సంస్థలను అమెరికా తన అధీనంలోకి వచ్చాయి. వాటి నుంచే భారత్‌తో సహా పలుదేశాలకు చమురు సరఫరా చేస్తున్నారు. 

వెనెజువేల చేతికి వచ్చిన తర్వాత ట్రంప్‌ ఇరాన్‌ మీదకి తన దళాలను పంపించి యుద్ధం మొదలుపెట్టారు. అమెరికా-ఇజ్రాయెల్ కలిసి ముందుగా అ దేశాధ్యక్షుడు అలీ ఖమైనీతో సహా అయన కుటుంబ సభ్యులు, పలువురు సైనిక కమాండర్లను హతం చేశాయి. అమెరికా-ఇజ్రాయెల్ కలిసి వారం రోజులుగా ఇరాన్‌ మీద ఏకధాటిగా భీకర దాడులు చేస్తూ దెబ్బ తీస్తున్నాయి. త్వరలోనే ఇరాన్‌ పని ముగుస్తుందని ట్రంప్‌ చెప్పారు. ఆ తర్వాత మరో యుద్ధం ఉందని కూడా చెప్పారు. ఈసారి క్యూబాపై దాడి చేయబోతున్నామని ట్రంప్‌ ప్రకటించారు. ఆ దేశం వలన అమెరికా భద్రతకు ముప్పు ఉన్నందున క్యూబాపై కూడా దాడులు జరిపి తమ దారికి తెచ్చుకుంటామని ట్రంప్‌ చెప్పారు. ఇరాన్‌, క్యూబా ప్రతినిధులు తమతో కాళ్ళ బేరానికి వచ్చారని వారితో చర్చలు జరుగుతున్నాయని ట్రంప్‌ చెప్పారు.         


Related Post