తెలంగాణలో రెండు రాజ్యసభ సీట్లకు కాంగ్రెస్ అభ్యర్ధులుగా సిట్టింగ్ రాజ్యసభ సభ్యుడు అభిషేక్ మను సింఘ్వీ, సిఎం రేవంత్ రెడ్డి సలహాదారు వేం నరేందర్ రెడ్డి నిన్న నామినేషన్స్ వేశారు. గడువు ముగిసే సమయానికి ఒక స్వతంత్ర అభ్యర్ధి తప్ప మరెవరూ నామినేషన్స్ వేయలేదు. స్వతంత్ర అభ్యర్ధికి ఎమ్మెల్యే మద్దతు ఉండదు కనుక నేడు నామినేషన్స్ పరిశీలన తర్వాత అతని నామినేషన్ తిరస్కరణకు గురవుతుంది.
బీఆర్ఎస్ పార్టీ కూడా అభ్యర్ధిని బరిలో దించుతుందని వార్తలు వెలువడినప్పటికీ చివరి నిమిషంలో ఆ ఆలోచన విరమించుకునట్లు అర్ధమవుతోంది. రెండు స్థానాలకు పోటీగా మరెవరూ లేరు కనుక అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి రాజ్యసభ సభ్యులుగా ఎన్నిక లాంఛనప్రాయమే అని భావించవచ్చు.